Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటుడు మాధవన్ కు గాయం... నిలిచిపోయిన షూటింగ్

నటుడు మాధవన్ 'సాలా ఖడూస్' సినిమా షూటింగ్ లో నిన్న గాయపడ్డాడు. దాంతో ఆ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. ఈ మేరకు ఈ విషయాన్ని ట్విట్టర్ లో చెబుతూ, "సెట్ లో గాయపడ్డాను. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నా. కానీ, నా వల్ల షూటింగ్ ఆగినందుకు బాధపడుతున్నా" అని ట్వీట్ చేశాడు. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోచ్ గా మారిన ఓ రిటైర్డ్ బాక్సర్ గా మాధవన్ కనిపిస్తాడు. మణిరత్నం వద్ద అసోసియేట్ గా పనిచేసిన సుధ కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది.

More Telugu News